ETV Bharat / state

ఇద్దరిపై దాడి చేసిన 20 మంది యువకులు

హైదరాబాద్ కుల్సుంపురా పీఎస్ పరిధిలో దాదాపు 20 మంది యువకులు... ఇద్దరు వ్యక్తులపై దాడి చేశారు. కత్తులు, రాడ్లతో విచక్షణారహితంగా కొట్టి పారిపోయారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

20 members attacked 2 members
ఇద్దరిపై దాడి చేసిన 20 మంది యువకులుఇద్దరిపై దాడి చేసిన 20 మంది యువకులు
author img

By

Published : May 26, 2020, 5:27 PM IST

హైదరాబాద్​ కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని దారుణం చోటు చేసుకుంది. గత రెండ్రోజుల క్రితం నితేష్ సింగ్, దీపక్​ల మధ్య గొడవ జరిగింది. దీపక్​ ఊరికే తనతో గొడవ పడతున్నాడని నితేష్ తన బాబాయి సంజయ్ సింగ్​కు చెప్పగా... ఇద్దరూ కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలో దీపక్ అతని స్నేహితులు వీరిని అడ్డగించి మళ్లీ గొడవకి దిగారు. దాదాపు 20 మంది కలిసి నితేష్, ఆయన బాబాయిపై రాడ్లు, కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన వారిని అక్కడే వదిలేసి పారిపోయారు.

20 members attacked by 2 people
ఇద్దరిపై దాడి చేసిన 20 మంది యువకులు

విషయం గుర్తించిన స్థానికులు వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీపక్, అతని స్నేహితులపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని నితేష్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా తమకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను వేడుకుంటున్నారు.

ఇవీ చూడండి: మద్యం సేవిస్తే.. కరోనా సోకే అవకాశాలు ఎక్కువ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.