ETV Bharat / state

శంషాబాద్ కిడ్నాప్ కేసు సుఖాంతం...

శంషాబాద్​లో నిన్న సాయంత్రం అపహరణకు గురైన మూడేళ్ల చిన్నారి ఎట్టకేలకు ఇంటికి చేరింది. అర్థరాత్రి సమయంలో నిందితుడు రంజిత్​సింగ్​ పాపతో ప్రత్యక్షంకావడం వల్ల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

శంషాబాద్ కిడ్నప్ కేసు సుకాంతం.
author img

By

Published : Aug 23, 2019, 8:48 AM IST

Updated : Aug 23, 2019, 10:35 AM IST

హైదరాబాద్​ శంషాబాద్​లోని గగన్​పహాడ్​లో నిన్న సాయంత్రం చాక్లెట్ ఇప్పిస్తానంటూ మూడేళ్ల శ్రద్ద అనే చిన్నారిని రంజిత్​సింగ్ అనే నిందితుడు అపహరించాడు. అర్థరాత్రి సమయంలో నిందితుడు​ పాపతో ప్రత్యక్షమయ్యాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా రంజిత్​సింగ్​ను అరెస్టు చేశారు. చిన్నారిని చూడగానే తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. వైద్యపరీక్షల నిమిత్తం పాపను ఆస్పత్రికి తరలించారు.

శంషాబాద్ కిడ్నాప్ కేసు సుఖాంతం...

ఇదీ చూడండి :వ్యభిచార కూపం నుంచి బంగ్లాదేశ్​ బాలికకు విముక్తి

Intro:TG_HYD_12_23_2YEARS BABY KIDNAP_AB_TS10020. 8008840002. M.bhujangareddy.(Rajendra nagar).Body:హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ విమానాశ్రయ పోలిస్టేషన్ పరిదిలోని గగన్ పహాడ్ లో 3 సంవత్సరాల బాలిక కిడ్నాప్కు గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశారు, బిస్కెట్లు ఇప్పిస్తామంటూ కిడ్నాప్ చేశాడని పోలీసుల ముందు ఆందోళన వ్యక్తం చేశారు. దీనితో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రావణ్ కుటుంబం ఐదేళ్ల క్రితం గగన్ పహాడ్ కు వచ్చింది. శ్రావణ్ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. శ్రవణ్ కుమార్ కు ముగ్గురు కుమార్తెలు కాగా ఇద్దరు కుమార్తెలు స్కూల్ లో చదువుతున్నారు. మూడవ కూతురు మూడేళ్ల శ్రద్ధ ఈ సాయంత్రం ఇంటిముందర ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు శ్రవణ్, శీల పరిసర ప్రాంతాల్లో వెతికినా కనిపించక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి సమీపంలో ఉన్న సిసి కెమెరాలను ప్రతి ఇంటి ఇంటికి వెళ్లి సోదాలు నిర్వహించారు. ఐతే ఇంటి సమీపంలో ఆడుకుంటున్న చిన్నారి శ్రద్ధకు చాక్లెట్స్, బిస్కెట్లు, గుడ్డు బజ్జీ ఇప్పిస్తానని ఓ గుర్తు తెలియని ఆగంతకుడు తీసుకెళ్లినట్టుగా స్థానికులు చెబుతున్నారు.Conclusion:స్పాట్ విజువల్స్
Last Updated : Aug 23, 2019, 10:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.