రాష్ట్రంలో కొత్తగా 1,811 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 2,10,346కు చేరింది. వైరస్‌తో తాజాగా 9 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 1,217కు పెరిగింది.
కొవిడ్ నుంచి కొత్తగా 2,072 మంది బాధితులు కోలుకోగా... ఇప్పటివరకు1,83,025 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 26,104 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 21,551 మంది బాధితులు హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 291 కరోనా కేసులు నమోదు కాగా..మేడ్చల్ జిల్లాలో 171, రంగారెడ్డి 138, నల్గొండ 108, కరీంనగర్ జిల్లాలో 100 కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి: దూర ప్రయాణాలకు ప్రజా రవాణా లేక ప్రైవేటుదోపిడీ!