రాష్ట్ర వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతోంది. తాజాగా 1,801 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు వైరస్ సోకిన వారి సంఖ్య 5,75,827కు చేరింది. మహమ్మారి బారినుంచి మరో 3,660 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 5,37,522 మంది వైరస్‌ను జయించారు. తాజాగా మరో 16 మంది బలికాగా.. మరణాలు 3,263కి చేరాయి. ప్రస్తుతం 35,042 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజా కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 390, ఆదిలాబాద్ 5, భద్రాద్రి కొత్తగూడెం 75, జగిత్యాల 49, జనగామ 15, జయశంకర్ భూపాలపల్లి 29, జోగులాంబ గద్వాల 25, కామారెడ్డి 4, కరీంనగర్ 92, ఖమ్మం 82, ఆసిఫాబాద్ 9, మహబూబ్‌నగర్ 69, మహబూబాబాద్ 60, మంచిర్యాల 47, మెదక్ 15, మేడ్చల్-మల్కాజిగిరి 101, ములుగు 12, నాగర్‌కర్నూల్ 38, నల్గొండ 45, నారాయణపేట 10, నిర్మల్ 3, నిజామాబాద్ 19, పెద్దపల్లి 68, రాజన్న సిరిసిల్ల 26, రంగారెడ్డి 114, సంగారెడ్డి 68, సిద్దిపేట 76, సూర్యాపేట 29, వికారాబాద్ 50, వనపర్తి 55, వరంగల్ రూరల్ 61, వరంగల్ అర్బన్ 54, యాదాద్రి భువనగిరిలో 6 చొప్పున కేసులు వెలుగు చూశాయి.
ఇదీ చూడండి: Lockdown Extension: రాష్ట్రంలో మరో 10 రోజులు లాక్‌డౌన్ పొడిగింపు