రాష్ట్రంలో మరో 163 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,97,113 మందికి మహమ్మారి సోకింది. వైరస్ బారిన పడి ఇప్పటివరకు రాష్ట్రంలో 1,622 మంది మరణించారు. మరో 101 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు మహమ్మారి నుంచి బయటపడిన వారి సంఖ్య 2,93,791కి చేరింది.
రాష్ట్రంలో ప్రస్తుతం 1,700 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 658 మంది బాధితులు ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 31 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
- ఇదీ చదవండి : 'కరోనాకు త్వరలో 19 టీకాలు!'