రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఆదివారం 5,290 నమూనాలు పరీక్షించగా... 1,590 మందిలో వైరస్ గుర్తించినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. కొత్త కేసులతో కలుపుకుంటే రాష్ట్రంలో కేసుల సంఖ్య 23,902కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోఅత్యధికంగా 1,277 మందికి కరోనా సోకింది.
మేడ్చల్‌లో 125, రంగారెడ్డి 82, సూర్యాపేట 23.....సంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 19 మందికి కొత్తగా మహమ్మారి బారినపడ్డారు. నల్గొండ జిల్లాలో 14 మందికి... వనపర్తి, కరీంనగర్ జిల్లాల్లో 4 చొప్పున కేసులు నమోదయ్యాయి. మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో 3 చొప్పున... నిర్మల్, వికారాబాద్, భద్రాద్రి, జనగాం జిల్లాల్లో 2 చొప్పున కేసులు వెలుగుచూశాయి. గద్వాల్, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్ గ్రామీణం, నారాయణ పేట్, పెద్దపల్లి, యాదాద్రి, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో..... ఒక్కో కేసు నమోదైనట్లు వైద్యా ఆరోగ్య శాఖ వివరించింది.
295కి చేరిన మృతుల సంఖ్య
ఆదివారం మహమ్మారి బారిన పడి మరో ఏడుగురు మృత్యువాత పడ్డారు. వారితో కలుపుకుంటే రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 295కి చేరింది. ఆదివారం కరోనా నుంచి కోలుకొని 1,166 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్ నుంచి కోలుకుని 12,703 మంది డిశ్చార్చి అయినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 10,904 మంది బాధితులు చికిత్స పొందుతున్నారని స్పష్టంచేసింది.
పురుషులే అత్యధికం
రాష్ట్రంలో ఇప్పటివరకు 1,15,835 మందికి కరోనా పరీక్షలు చేయగా... 91,933 మందికి నెగెటివ్ వచ్చినట్లు....... అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసులను పరిశీలిస్తే బాధితుల్లో పురుషులే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడవుతోంది. మొత్తం బాధితుల్లో...... పురుషులు 15,559 మంది ఉండగా...... 8,343 మంది మహిళలు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది. వారిలో 13 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కులు 20,091 మంది ఉన్నారని తెలిపింది.
ఇదీ చూడండి: స్పీడు పెంచిన కరోనా- 'మహా'లో కొత్తగా 6,555 కేసులు