ETV Bharat / state

హైదరాబాద్‌లో 150 చేపల అవుట్‌లెట్స్‌: తలసాని

హైదరాబాద్‌లో చేపలకు మంచి డిమాండ్ ఉందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. భాగ్యనగరంలో 150 చేపల అవుట్‌లెట్స్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్​లోని తన కార్యాలయంలో పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమపై సమీక్ష నిర్వహించారు.

150 outlets will arrange in hyderabad: talasani srinivas yadav
హైదరాబాద్‌లో 150 చేపల అవుట్‌లెట్స్‌: తలసాని
author img

By

Published : Jul 27, 2020, 2:02 PM IST

Updated : Jul 27, 2020, 2:24 PM IST

రాష్ట్రంలో పుష్కలమైన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆగస్టు 5 నుంచి ఉచిత చేప, రొయ్య పిల్లల పంపిణీ చేపట్టనున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్​లోని తన కార్యాలయంలో పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, సంచాలకులు డాక్టర్ లక్ష్మారెడ్డి, అదనపు సంచాలకులు రాంచందర్, టీఎస్ఎల్డీఏ సీఈవో డాక్టర్ మంజువాణి, పాడి పరిశ్రమాభివద్ధి సహకార సమాఖ్య ఎండీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

చేపలు, రొయ్య పిల్లలు, పాడి గేదెలు, గొర్రె పిల్లల రెండో విడత పంపిణీ, జీవులకు వాక్సినేషన్, డీవార్మింగ్ పంపిణీ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.రాష్ట్ర వ్యాప్తంగా 81 కోట్ల చేప పిల్లలు, రొయ్య పిల్లల పంపిణీ కోసం ప్రణాళికలు సిద్ధం చేశామని శ్రీనివాస్​ యాదవ్ వెల్లడించారు. ఆగస్టు​ 5 నుంచి జరిగే చేప పిల్లల పంపిణీలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ‌ప్రతినిధులు, మత్స్యకారులు పాల్గొంటారని ప్రకటించారు. ప్రజల అవసరాల దృష్ట్యా చేపల మార్కెట్లను విస్తరిస్తామన్నారు. హైదరాబాద్‌లో చేపలకు మంచి డిమాండ్ ఉందన్నారు. భాగ్యనగరంలో 150 చేపల అవుట్‌లెట్స్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. మత్స్యకారులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

హైదరాబాద్‌లో 150 చేపల అవుట్‌లెట్స్‌: తలసాని

ఇవీ చూడండి: రికవరీలో రికార్డు- ఒక్కరోజే 36 వేల మంది డిశ్చార్జ్

Last Updated : Jul 27, 2020, 2:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.