హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇజ్జత్‌నగర్‌లో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. 230 ఇళ్లలో తనిఖీలు చేశారు.
15 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 15 ఆటోలు, 26 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ, ఏసీపీ, 10 మంది సీఐలు, 32 మంది ఎస్ఐలు, 250 మంది పోలీసులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : 'సహకారం'లో సగానికిపైగా ఏకగ్రీవం!