రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మరో 1,446 మందికి పాజిటివ్ వచ్చినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 2,16,238కి చేరింది. మరో 8 మంది వైరస్‌తో మృతిచెందగా, ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,241కి పెరిగింది.
1,918 మంది కోలుకోగా మొత్తం 1,91,269 మంది కరోనాను జయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 23,728 యాక్టివ్ కేసులున్నాయి. వారిలో 19,413 మంది ఐసోలేషన్‌లో ఉన్నారని వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.
ఇదీ చూడండి : కీసర తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య