ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని యశోద ఆసుపత్రి ఎదుట కుటుంబసభ్యులు, మహిళాసంఘాల నేతలు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ప్రేమోన్మాదుల వరుస దాడులతో భాగ్యనగరం వణికిపోతుందని జీహెచ్ఎంసీ మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి ఆందోళన వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఏ పాపం ఎరుగని తమ కుమార్తెపై దాడి చేసిన భరత్‌ను కఠినంగా శిక్షించాలని మధులిక తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
నిందితుడు భరత్‌కు నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. అనంతరం చంచల్‌గూడ కేంద్ర కారాగానికి తరలించారు. మధులికపై పథకం ప్రకారం దాడి చేశాడా..ఇంకా ఎవరైనా సహకరించారా అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.