ETV Bharat / state

13 GHMC Ward Offices Inauguration in Hyderabad : మెరుగైన సేవలే లక్ష్యంగా అందుబాటులోకి వచ్చిన మరో 13 వార్డు కార్యాలయాలు - Ward Office Administration in Hyderabad

13 GHMC Ward Offices Inauguration in Hyderabad Today : భాగ్యనగరంలో పౌరులకు మరింత మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వార్డు కార్యాలయాల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ నగరంలో మొత్తం 150 వార్డులకు.. రెండు నెలల క్రితం 137 వార్డు కార్యాలయాలు ప్రారంభించారు. మిగిలిన 13 వార్డుల్లో ఇవాళ వార్డు కార్యాలయాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. మంత్రులు మహమూద్​ అలీ, తలసాని, మేయర్​ గద్వాల విజయలక్ష్మి ప్రారంభించారు.

Ward Office Administration in Hyderabad
GHMC Ward Offices Opens in Hyderabad
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 30, 2023, 7:25 PM IST

13 GHMC Ward Offices Inauguration in Hyderabad Today : హైదరాబాద్ జంట నగరాల్లోని ప్రజలకు మొత్తం 150 వార్డు కార్యాలయాలు(GHMC Ward offices) అందుబాటులోకి వచ్చాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 150 డివిజన్లలో వార్డుకు.. ఒక వార్డు కార్యాలయాన్ని ప్రారంభించాలని మొదట నిర్ణయించినా.. సాధ్యం కాలేదు. దీంతో రెండు నెలల క్రితం 137 వార్డు కార్యాలయాలను ప్రారంభించారు. మిగతా 13 ఇవాళ నగరంలో ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు.. ప్రభుత్వం ఈ వార్డు కార్యాయలను ప్రారంభించినట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది.

ఈ వార్డు కార్యాలయాల్లో ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదు చేయడంతో.. వెను వెంటనే సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారి వార్డు కార్యాలయానికి ఇంఛార్జీగా ఉండగా.. మొత్తం పది మంది వివిధ శాఖలకు చెండిన అధికారులు ఇక్కడ పని చేస్తున్నారు.

GHMC Ward Offices : వార్డు కార్యాలయాలు.. ప్రజల చెంతకే సేవలు

ఈ కార్యాలయాల్లో ఇంజినీరింగ్ సిబ్బంది, రోడ్లు డ్రైనేజీల వంటి వాటి నిర్వహణ, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, భవన నిర్మాణం విషయాలపై, ఎంటమాలజీ విభాగం అధికారులు దోమల సమస్య, మహిళా సంఘాలకు ఉపయుక్తంగా ఉండేలా వార్డు కమ్యూనిటీ ఆఫీసర్, పారిశుద్ధ్య సిబ్బందిని సమన్వయం చేసుకునేందుకు వార్డ్ శానిటరీ జవాన్, అర్బన్ బయోడైవర్సిటీ సూపర్​వైజర్, తాగునీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణకు సంబంధించి జలమండలి నుంచి వార్డ్ అసిస్టెంట్, విద్యుత్ శాఖకు సంబంధించిన ఒక ఆధికారి వార్డులైన్​మెన్, ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఈ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటారు.

Ward Office Administration in Hyderabad : వార్డు అధికారుల జాబ్ చార్టుతో పాటు పౌరుల ఫిర్యాదులను ఎంత కాలంలో పరిష్కరిస్తామో చెప్పే సిటిజన్ చార్ట్​ని ఏర్పాటు చేశారు. స్థానిక వార్డు కార్యాలయానికి కాకుండా ఇతర వార్డు కార్యాలయంలో ప్రజలు ఫిర్యాదు చేస్తే.. వాటిని స్వీకరించి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. సనత్​నగర్​లోని రాంగోపాల్​పేట, ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని భోలఖ్​పూర్, అంబర్​పేట నియోజకవర్గ పరిధిలోని తిలక్​నగర్​లో ఏర్పాటు చేసిన వార్డ్ ఆఫీసులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.

KTR Speech at Ward Office Inauguration : 'వికేంద్రీకరణ, ప్రజలు కేంద్రంగా పాలనే మా లక్ష్యం'

గోషామహల్ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన మూడు వార్డు ఆఫీసులను హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ముషీరాబాద్​లోని రాంనగర్​లో ఏర్పాటు చేసిన వార్డ్ ఆఫీస్​ను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ప్రారంభించారు. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని చింతల్ బస్తీ, నాంపల్లి నియోజకవర్గ పరిధిలోని మెహిదీపట్నంలలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు.

Ward Offices in GHMC : నాంపల్లి నియోజకవర్గ పరిధిలోని విజయనగర్ కాలనీ, బజార్​ఘాట్​లలో ఏర్పాటు చేసిన ఆఫీసులను ఎమ్మెల్సీ ప్రభాకర్​రావు ప్రారంభించారు. అహ్మద్​నగర్, సాయిబాబా దేవాలయాల వద్ద ఏర్పాటు చేసిన ఆఫీసులను నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్​లు ప్రారంభించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు వేరు వేరు ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

సిటిజన్‌ చార్టర్‌లో సూచించిన విధంగా ఫిర్యాదులను పరిష్కరించడం కోసం వార్డు కార్యాలయాల్లో అసిస్టెంట్‌ మున్సిపల్‌ కమిషనర్‌ (ఏఎమ్‌సీ) నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వీధిదీపాల విభాగం అధికారులు, శానిటేషన్‌, ఎంటమాలజీ, యూబీడీ విభాగంతో సహా పది విభాగాలకు చెందిన అధికారులు ఉదయం నుంచే ఫీల్డ్‌లో ఉండి తమకు వస్తున్న ఫిర్యాదులను పరిష్కరిస్తున్నారు. ఉదయం ఫీల్డ్ లో ఉన్నా.. సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలనే నిబంధన ఉన్న.. అక్కడక్కడ ఉంటున్నా మిగతా కార్యాలయాల్లో మాత్రం ప్రజలకు అందుబాటులో ఉండటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

"తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు వేరు వేరు ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. వార్డు ఆఫీసుకు వచ్చి ఫిర్యాదు చేస్తే చాలు.. అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారు. హైదరాబాద్​లో అన్ని డివిజన్లలో కలిపి 150 వార్డు కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయి". - తలసాని శ్రీనివాస్​ యాదవ్​, మంత్రి

13 GHMC Ward Offices Inauguration in Hyderabad మెరుగైన సేవలే లక్ష్యంగా అందుబాటులోకి వచ్చిన మరో 13 వార్డు కార్యాలయాలు

Wards Governance in GHMC : జీహెచ్‌ఎంసీలో వార్డుల పాలనకు నేడు శ్రీకారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.