రాష్ట్రంలో కరోనా విజృంభన కొనసాగుతోంది. శుక్రవారం 10,354 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1278మందికి పాజిటివ్ వచ్చింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 32,224కు చేరింది. కొవిడ్‌తో మరో ఎనిమిది మంది చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 339కి పెరిగింది.
రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని 1013 మంది డిశ్చార్జయ్యారు. ఇప్పటి వరకు వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 19,205కు చేరింది. మొత్తం బాధితుల సంఖ్య 12,680కు చేరింది. ఇందులో దాదాపు 10 వేల మంది హోమ్ ఐసోలాషన్‌లో ఉన్నట్లు సమాచారం. ఇక ఇప్పటి వరకు ఉన్న గణాంకాలను పరిశీలిస్తే.. రాష్ట్రంలో డిశ్చార్జ్ అవుతున్న వారు 60 శాతం ఉండగా, 1 శాతం మరణాలు, 39 శాతం మాత్రమే ప్రస్తుతం యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
ఇక యాక్టివ్ కేసుల్లో కూడా 83% మందిలో ఎలాంటి లక్షణాలు ఉండటం లేదని, 13% మందిలో కొద్దిపాటి లక్షణాలు ఉండగా కేవలం 4% మందిలో మాత్రమే తీవ్ర లక్షణాలు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. శుక్రవారం జీహెచ్ఎంసీ పరిధిలో 762 కరోనా కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి పరిధిలో 171 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ జిల్లాలో 85, సంగారెడ్డి 36, నల్గొండ 32, మెదక్ 22, కామారెడ్డి 23, ఖమ్మం జిల్లాలో 18 కేసులొచ్చాయి.
ఇదీ చదవండి: కూల్చివేత ఎఫెక్ట్: ఆలయం, మసీదు దెబ్బతినటంపై సీఎం విచారం