ETV Bharat / state

ఏపీ: నాలుగు తరాల శతాధిక వృద్ధుడు మృతి - ఏపీ కడప జిల్లా తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్​ కడప జిల్లాలో 111 ఏళ్ల కురు వృద్ధుడు మరణించాడు. రాయచోటిలోని మేదర వీధిలో మంగళవారం ఆయనకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు.

111-years-old-man-died-in-kadapa-district
ఏపీ: నాలుగు తరాల శతాధిక వృద్ధుడు మృతి
author img

By

Published : Jun 23, 2020, 3:30 PM IST

రాజుల కాలంలో రాజ్యాలు చూశారు. పాలకుల రాజనీతిని గ్రహించారు. భారతదేశాన్ని ఏలిన పరదేశి తెల్లదొరల పాలనను భరించారు. దేశానికి స్వతంత్రం తీసుకురావడానికి జరిగిన పోరాట స్ఫూర్తిని గ్రహించారు. కుటుంబానికి నాన్న, తాత, ముత్తాత, ఇలా నాలుగు తరాలకు పెద్దగా వ్యవహరించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆయనే ఏపీలోని కడప జిల్లా గాలివీడు మండలం తూముకుంటకు చెందిన 111 ఏళ్ల ఖాదర్ మొహిద్దీన్.

మంచి భూస్వామ్య కుటుంబంలో జన్మించిన ఆయన 111 ఏళ్లు జీవించి… తుది శ్వాస విడిచారు. ఖాదర్ మొహిద్దీన్ 1909 జనవరి 19న తూముకుంటలో జన్మించారు. వ్యవసాయ కుటుంబం కావడం... ఆయనకు పాడి పంటలపై వ్యామోహం ఎక్కువ. మంచి పంటలు పండించి గ్రామంలో ఆదర్శంగా నిలుస్తూ… వచ్చారు. ఆయన భార్య సాల్మాబీ 73 ఏళ్ల వయసులో మృతి చెందారు. ఖాదర్ మొహిద్దీన్​కు ఐదుగురు కుమారులు, కుమార్తె, మనుమలు, మనవరాళ్లు ఉన్నారు. రాయచోటిలోని మేదర వీధిలో మంగళవారం ఆయనకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు.

ఇవీ చూడండి: 'భాజపా పాలిత ప్రాంతాల్లోనే కేసులు ఎక్కువ... ఆ మ్యాప్ నకిలీది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.