ETV Bharat / state

Telangana Decade Celebrations : దశాబ్ది ఉత్సవాల ఖర్చులకు కలెక్టర్లకు రూ.105 కోట్లు విడుదల - KCR latest news

kcr
kcr
author img

By

Published : May 25, 2023, 2:43 PM IST

Updated : May 25, 2023, 3:55 PM IST

14:39 May 25

కలెక్టర్లకు రూ.105 కోట్లు విడుదల చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం

Telangana Decade Celebrations : తెలంగాణ ప్రగతి ప్రస్థానం, అమరుల త్యాగాలు గుర్తు చేసుకుంటూ.. ప్రజల అకాంక్షలకు అనుగుణంగా.. తెలంగాణ ఘనకీర్తిని చాటి చెప్పేలా.. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావరణంలో జరుపుకోవాలని సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఆరు దశాబ్దాల పోరాటాలు, త్యాగాల ఫలితంగా ప్రజాస్వామ్య పంథాలో సాధించుకున్న తెలంగాణ.. స్వరాష్ట్రంలో అనతి కాలంలోనే దేశం గర్వించేలా పదేళ్లకు చేరుకున్న సందర్భంలో వేడుకలు వైభవంగా జరగాలని అన్నారు.

రోజు వారీ చేపట్టాల్సిన కార్యక్రమాలు : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యచరణపై దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. మంత్రులు, ముఖ్య సలహాదారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, సీఎంఒ కార్యదర్శులు, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు సమావేశంలో పాల్గొన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రోజు వారీ కార్యక్రమాల గురించి.. రోజు వారీ చేపట్టాల్సిన కార్యక్రమాలను కలెక్టర్లకు కేసీఆర్ సూచించారు.

రూ.105 కోట్ల నిధులు విడుదల : గ్రామాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి కేసీఆర్ వివరించారు. మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన ఖర్చులకు గాను కలెక్టర్లకు రూ.105 కోట్ల నిధులు విడుదల చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

21 రోజులపాటు ఘనంగా వేడుకలు : ఇటీవలే తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల షెడ్యూల్​ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. జూన్ 2 నుంచి 22 వరకు.. 21 రోజులపాటు ఘనంగా వేడుకలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగానే రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జూన్ రెండో తేదీన కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం గన్​పార్క్​లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తారు. తర్వాత సచివాలయం ప్రాంగణంలో సీఎం జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.

ఈ క్రమంలోనే కేసీఆర్ దశాబ్ది ఉత్సవ సందేశంను ఇస్తారు. మరుసటి రోజు జూన్ 3 నుంచి జూన్‌ 22 వరకు రోజుకు ఒక రంగం చొప్పున.. ఆయా రంగాలకు చెందిన ప్రగతిని వివరించేలా కార్యక్రమాలు చేపట్టనున్నారు. వేడుకల చివరిరోజు జూన్ 22న అమరుల సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే ట్యాంక్​బండ్‌పై కళాకారులతో భారీ ర్యాలీ ఏర్పాటు చేయనున్నారు. నూతనంగా నిర్మించిన అమరుల స్మారకాన్ని కేసీఆర్ ఆవిష్కరిస్తారు. అదే రోజు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఉదయం అమరవీరుల స్థూపాల వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తారు. అనంతరం సాయంత్రం హైదరాబాద్‌లో నిర్వహించే సభలో పాల్గొంటారు.

ఇవీ చదవండి : Telangana Decade Celebrations : దద్దరిల్లేలా దశాబ్ది వేడుకలు.. షెడ్యూల్​ ఇదే

Jeevan Reddy Fires on BRS Govt : 'రైస్‌మిల్లర్ల చెప్పుచేతుల్లో ధాన్యం సేకరణ'

కొత్త పార్లమెంట్​ ఓపెనింగ్​పై సుప్రీంకోర్టులో కేసు.. విమర్శల దాడి పెంచిన కాంగ్రెస్

Last Updated : May 25, 2023, 3:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.