కొండాపూర్‌లోని చండ్ర రాజేశ్వర్‌రావు వృద్ధాశ్రమంలోని 27 మంది వృద్ధులు, సిబ్బంది కరోన బారిన పడ్డారు. వీరిని టిమ్స్, గాంధీ, నేచర్‌క్యూర్ ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం తరలించారు. వీరిలో ఇద్దరు వృద్దులు మృతి చెందారు. మిగతా వారు కోలుకొని తిరిగి వృద్ధాశ్రమానికి చేరుకున్నారు.
కోలుకున్న వారిలో 103 సంవత్సరాల వృద్ధుడు పరుచూరి రామస్వామి ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోన రోగులకు అందిస్తున్న వైద్య సేవలను సీఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు నారాయణ ప్రశంసించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్ కరోన రోగులకు మెరుగైన చికిత్స అందించేందుకు కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చూడండి: కూరగాయల సాగు వాటి అమ్మకాలపైనా కరోనా ప్రభావం