రైతుబంధు పథకం కింద సోమవారం రాష్ట్రప్రభుత్వం రైతుల ఖాతాలకు రూ.500 కోట్లు జమచేసింది. తర్వలో మరో రూ.500 కోట్లు జమచేయనుంది. గత జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ముగిసిన ఖరీఫ్ సీజన్‌కు ఈ పథకం కింద రూ. 1700 కోట్లను విడుదల చేయాల్సి ఉంది. రాష్ట్రంలో రెవెన్యూ శాఖ లెక్కల ప్రకారం 61.13 లక్షల భూమి ఖాతాలున్నాయి. వీటిలో 58లక్షల మంది రైతులకు కొత్త పట్టదారు పాసుపుస్తకాలు ఇప్పటికే ఇచ్చినట్లు రెవెన్యూశాఖ చెబుతోంది. కానీ గత ఖరీఫ్ సీజన్ ముందు నాటికి 54.30లక్షల పాసుపుస్తకాలే ఇచ్చారు. అందువల్ల వారి వివరాలనే రైతుబంధు పథకానికి వ్యవసాయశాఖ ఆన్లైన్లో నమోదు చేసింది. వీరి ఖాతాల్లో ఎకరానికి రూ.5వేల చొప్పున మొత్తం రూ.4800 కోట్లను జమ చేసింది. ఇలా సొమ్ము పడిన వారిలో అత్యధిక శాతం మంది 10 ఎకరాల్లోపు భూమి కలిగిన వారే ఉన్నారు.
ఇదీ చూడండి: ఆత్మహత్యకు యత్నించిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి మృతి