ETV Bharat / state

రాష్ట్రంలో మూడో వంతు మిగిలిన పాలిటెక్నిక్ సీట్లు..

author img

By

Published : Oct 3, 2020, 10:45 PM IST

తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యపై విద్యార్థులు ఆసక్తి చూపలేదు. దాదాపు మూడో వంతు పాలిటెక్నిక్ సీట్లు మిగిలిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 10 వేల 202 సీట్లు భర్తీ కాలేదు.

Polytechnic seats in telangana
రాష్ట్రంలో మూడో వంతు మిగిలిన పాలిటెక్నిక్ సీట్లు..

రాష్ట్రంలో దాదాపు మూడో వంతు పాలిటెక్నిక్ సీట్లు మిగిలిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 10 వేల 202 సీట్లు భర్తీ కాలేదు. పాలిటెక్నిక్ అభ్యర్థులకు శనివారం తుది విడతలో 3 వేల 69 సీట్లు కేటాయించారు.

రాష్ట్రవ్యాప్తంగా 132 కాలేజీల్లో 31 వేల 792 సీట్లు ఉండగా.. రెండు విడతల్లో కలిపి 67.91 శాతం.. 21 వేల 590 సీట్లు భర్తీ అయ్యాయి. రాష్ట్రంలో 40 ప్రభుత్వ, ఆరు ప్రైవేట్ కాలేజీల్లో సీట్లన్నీ నిండాయి. ప్రైవేట్ కాలేజీల్లో 9 వేల 556, ప్రభుత్వ కళాశాలల్లో 616 సీట్లు మిగిలాయి.

శనివారం తుది విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 6 వరకు ఆన్ లైన్ లో ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. ఈనెల 5, 6 తేదీల్లో కళాశాలల్లో చేరాలని.. 7వ తేదీన విద్యా సంవత్సరం ప్రారంభించి.. 15న తరగతులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

ఇవీచూడండి: ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే దుబ్బాకలో ఎన్నికల వేడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.