10 Lakh People Download C vigil App : ఎన్నికల సమయంలో ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు ఎన్నికల సంఘం రూపొందించిన సీ విజిల్ యాప్(C Vigil app Downloads)కు విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు ఈ యాప్‌ను పది లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేలా నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, వస్తువులు పంపిణీ చేసినా ఈ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చు.
C Vigil app Downlods : ప్రజల ఆస్తులను నష్టపరిచినా, కులమత ద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసినా, అసత్య వార్తలు ప్రసారం చేసినా, ఓటర్లను బెదిరించినపుడు, చెల్లింపులు చేయడం, మద్యం లేదా మాదక ద్రవ్యాల రవాణా, ఓటర్ల రవాణా.. వాటికి సంబంధించిన వివరాలు ఇవ్వడంతో పాటు మారణాయుధాలు కలిగి ఉంటే ఆ సమాచారాన్ని కూడా యాప్ ద్వారా ఎన్నికల సంఘానికి నివేదించవచ్చు.
C Vigil App Downlods in India : సీ విజిల్ యాప్‌లో ఫొటోలు, వీడియోలు, ఆడియోల రూపంలో అయినా ఫిర్యాదు చేసేలా ఈసీ వెసులుబాటు కల్పించింది. ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన దగ్గర నుంచి ఈ యాప్‌లో ఫిర్యాదు(C Vigil app Complaints) చేయవచ్చు. మనం ప్రలోభాలకు జరిగిందని ఫిర్యాదు చేస్తే.. దాని స్టేటస్ ఎంతవరకు వచ్చిందో స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేసిన వ్యక్తి వివరాలను గోప్యంగా ఉంచుతుందని ఈసీ వెల్లడించింది. ఫిర్యాదు చేసిన 100 నిమిషాల్లోనే స్పందించేలా దీనిని ఏర్పాటు చేశారు.
పది దాటిన తర్వాత ప్రసంగాలా - అయితే 'విజిల్'వేయడమే
USE of C Vigil App : ఫిర్యాదుదారుడు నుంచి కంప్లెయింట్ అందిన మొదటి 5 నిమిషాల్లో జిల్లా ఎన్నికల అధికారి వెరిఫికేషన్ కోసం ఫీల్డ్ యూనిట్‌కు ఫిర్యాదును పంపిస్తారు. అనంతరం 15 నిమిషాల్లో ఫీల్డ్ టీం ఫిర్యాదు వచ్చిన ప్రదేశానికి చేరుకుంటుంది. 30 నిమిషాల్లో ఫీల్డ్ టీం చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు చేసి.. తగిన చర్యలు అమలు చేసి.. నివేదికను ఈసీకి పంపిస్తారు. 50 నిమిషాల్లో నివేదికపై రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు ముగిస్తారు.
C Vigil App Users in Telangana : ఎన్నికల సమయంలో అభ్యర్థులు ప్రచారానికి ఆ యాప్ ద్వారా అనుమతి తీసుకునేలా ఈసీ ఏర్పాటు చేసింది. ఓటర్లు తమ అభ్యర్థి గురించి వివరాలు తెలుసుకునేందుకు ఈ యాప్‌లో వివరాలను పొందుపరిచింది. ఆయా నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్ధుల వివరాలను మొత్తం దీనిలో లభిస్తాయి. దీంతో ఓటర్లు తమ అభ్యర్థిని ఎన్నుకునేందుకు సులభంగా ఉంటుంది. ఈ యాప్ సామాన్యుని చేతిలో బ్రహ్మాస్త్రంగా ఉంటుందని ఈసీ(Election Commission) పేర్కొంది. ఇప్పటికే రాష్ట్రంలో ఈ యాప్ ద్వారా చాలా ఫిర్యాదులు అందాయని వెల్లడించింది.