క్రీడాకారులు ఉన్నత విద్య అభ్యసించడానికి ఎంబీబీఎస్, బీడీఎస్ మినహా అన్ని ప్రొఫెషనల్ కోర్సుల్లో 0.5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు రాష్ట్ర క్రీడా శాఖ తెలిపింది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఐఐఐటీ, బీ-ఫార్మసీ, ఐసెట్, ఈసెట్, ఎంబీఏ ప్రొఫెషనల్ కోర్సుల్లో క్రీడాకారులకు 0.5 శాతం రిజర్వేషన్ వర్తిస్తుందని క్రీడాశాఖమంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
క్రీడా పాలసీ అమలులో భాగంగా క్రీడాశాఖ ఆధ్వర్యంలోని ఉన్నత స్థాయి కమిటీ సూచించిన మేరకు 31 క్రీడాంశాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకే రిజర్వేషన్ కల్పించినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణను క్రీడాహబ్‌గా తీర్చిదిద్ధడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని తెలిపారు.
ఇవీ చూడండి: ఆ రెండు ప్రాజెక్టుల నిర్వహణ మాకే ఇవ్వాలి: కేసీఆర్