ETV Bharat / state

నక్సల్స్​ నుంచి వెంకయ్యను కాపాడిన వ్యక్తి తెలుసా? - job

నక్సల్స్​ నుంచి కాపాడినందుకు ఉద్యోగమిప్పిస్తానని హామి ఇచ్చిన వెంకయ్యనాయుడు. నెరవేర్చాలని సదరు వ్యక్తి వినతి.

నక్సల్స్​ నుంచి కాపాడినందుకు వెంకయ్యనాయుడు ఉద్యోగ హామి
author img

By

Published : Feb 7, 2019, 5:58 AM IST

నక్సల్స్ నుంచి కాపాడినందుకు వెంకయ్యనాయుడు ఉద్యోగ హామి
దేశంలో నిరుద్యోగుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. కొంతమంది ప్రతిభతో ఉద్యోగం పొందితే, ఇంకొందరు డబ్బులిచ్చి కొనుక్కుంటారు. మరికొందరు పెద్దవారి సిఫార్సులతో ఉద్యోగం పొందుతారు. ఇవేమి లేకుండానే ఆర్థికంగా కుంగిపోతున్న ఓ వ్యక్తికి అనుకోకుండా స్వయాన ఉపరాష్ట్రపతే హామీ ఇస్తే ఎంత సంతోషంగా ఉంటారు... ఆ వ్యక్తీ సంతోషించాడు, కానీ వెంకయ్య హామీకి మాత్రం విలువ లేకుండా పోయింది. ఈ ఘటన బిహార్​లో జరిగింది.
undefined

2005లో అప్పటి భాజపా జాతీయాధ్యక్షుడిగా ఉన్న వెంకయ్య నాయుడు ఓసారి బిహార్​లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనుకోకుండా హెలికాప్టర్​లో ఇంధనం అయిపోయింది. అత్యవసరంగా పండరియా గ్రామంలో దిగారు. అప్పట్లో ఆ ప్రాంతంలో నక్సళ్ల ప్రభావం ఎక్కవగా ఉండేది. హెలికాప్టర్​లో ఉన్న వారికి బెంగ పట్టుకుంది. సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో రాజేంద్ర అనే వ్యక్తి అటుగా వెళ్లడం చూశారు. తర్వాత రాజేంద్ర తన సొంత వాహనంలో వెంకయ్య నాయుడిని బారాచట్టి పోలీసు స్టేషన్​కు తీసుకెళ్లారు.

నెరవేరని వెంకయ్య మాట...

సహాయం చేసిన రాజేంద్రకు ఆర్థికంగా సహాయం చేస్తానని మాట ఇచ్చారు వెంకయ్య. కేంద్ర మంత్రి అరుణ్​ జైట్లీ సైతం ఓ సందర్భంలో రాజేంద్రను అభినందించారు.

"హెలికాప్టర్​ వచ్చి ఇక్కడ ఆగింది. వెంకయ్యను చూడటానికి చాలమంది వచ్చారు. నా కొత్త వాహనంపై ఆయనను తీసుకెళ్లాను. దారిలో ఆయన నా పేరు అడిగారు. రాజేంద్ర సావ్​ అని చెప్పాను. దారిలో ఎంతో హడావుడి జరిగింది. అది చూసి నాకు భయమేసింది. భయపడకు నేను వెంకయ్య నాయుడిని... నీకు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు."
--- రాజేంద్ర సావ్​.

కానీ ఇప్పటికీ ఆ మాట నిజం కాలేదు. భాజపా నేతకు సహాయం చేసినందుకు రాజేంద్రపై నక్సలైట్లు దాడి చేశారు. అనేక విధాలుగా చిత్ర హింసలు పెట్టారు. చంపేస్తామని బెదిరించగా రాజేంద్ర బిహార్​ను విడిచారు. ఛత్తీస్​గఢ్​లో నివాసం ఏర్పరచుకున్నారు. ఉద్యోగం లేక ఎంతో బాధపడ్డారు.

వెంకయ్య మాటతో ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు తిరిగారు రాజేంద్ర. ఎట్టకేలకు... సైన్యంలో ఉద్యోగమిస్తామని అప్పటి ఛత్తీస్​గఢ్​ ముఖ్యమంత్రి రమణ్ సింగ్​ హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికి వారి నుంచి పిలుపు రాలేదు. అ తర్వాత కొన్ని సందర్భాల్లో వెంకయ్యను కలిశానని రాజేంద్ర తెలిపారు. కనీసం తన పిల్లలకైనా ఉద్యోగం ఇస్తే ఆర్థిక స్తోమత పెరుగుతుందని రాజేంద్ర ఆశగా ఎదురు చూస్తున్నారు.

New Delhi, Feb 06 (ANI): Businessman Robert Vadra arrived at the office of Enforcement Directorate (ED) over money laundering charges. Wife Priyanka Gandhi accompanied him; however, she soon left the venue.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.