ETV Bharat / state

'ఆదర్శప్రాయమైన రచయిత్రి ఛాయాదేవి' - poet

తెలుగులో స్త్రీవాదం పుట్టకముందే స్త్రీల సమస్యల పట్ల రచనలు చేస్తు సమాజాన్ని ఆలోచింపజేసిన రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి అని ప్రముఖ రచయిత్రి మృణాళిని అన్నారు. గత రాత్రి అనారోగ్యంతో మృతి చెందిన ఛాయాదేవి పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.

'ఆదర్శప్రాయమైన రచయిత్రి ఛాయాదేవి'
author img

By

Published : Jun 28, 2019, 5:39 PM IST

ప్రఖ్యాత రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి అనారోగ్యంతో రాత్రి మృతి చెందారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఛాయాదేవి దిల్​సుఖ్​నగర్​లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆమె భౌతిక కాయాన్ని కొండాపూర్​లోని సీఆర్ ఫౌండేషన్​కు తరలించారు. రాజమండ్రిలో జన్మించిన ఛాయాదేవి ప్రముఖ సాహితీ వేత్త అబ్బూరి రాజేశ్వరరావును వివాహమాడారు. దిల్లీలోని జేఎన్​యులో లైబ్రేరియన్​గా సేవలందించారు.

సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై అనేక రచనలు చేసారు అబ్బూరి ఛాయాదేవి. 'తను మార్గం' అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. తెలుగులో స్త్రీవాదం పుట్టక మునుపే యాభైయ్యో దశకం నుంచి స్త్రీ సమస్యల పట్ల రచనలు చేస్తూ సమాజాన్ని ఆలోచింపజేసిన వ్యక్తి ఛాయాదేవి అని ప్రముఖ రచయిత్రి మృణాళిని అన్నారు. ఆమె అన్ని తరాలకు ఒక ఆదర్శప్రాయమైన రచయిత్రి అని మృణాళిని పేర్కొన్నారు.

గత ఎనిమిది నెలలుగా సిఆర్ ఫౌండేషన్​లోని వృద్ధాశ్రమంలో జీవనం సాగిస్తున్న ఛాయాదేవి తన కోరిక మేరకు మరణానంతరం ఆమె పార్థివదేహాన్ని సీఆర్ ఫౌండేషన్​కు దానం చేశారు. పలువురు సాహితీ ప్రముఖులు, మహిళా రచయితలు ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు.

'ఆదర్శప్రాయమైన రచయిత్రి ఛాయాదేవి'

ఇవీ చూడండి: 'ప్రజాస్వామ్య పునరుద్ధరణ, ఉగ్రవాద నిర్మూలనే లక్ష్యం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.