ETV Bharat / state

ఈ నెల 18, 19న శాసనసభ ప్రత్యేక సమావేశాలు - ఈ నెల 18,19న శాసనసభ ప్రత్యేక సమావేశాలు

నూతన చట్టానికి అనుగుణంగానే పురపాలక ఎన్నికలు జరగనున్నాయి. నెలాఖర్లోగా పూర్తి కావాల్సిన ఎన్నికలు వచ్చే నెల మొదటి వారంలో జరగనున్నాయి. రిజర్వేషన్ల అంశం సహా ఇతరత్రాలకు సంబంధించి పూర్తి స్పష్టత ఉండాలన్న ఉద్దేశంతో కొత్త చట్టం తీసుకొచ్చాకే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఈ నెల 18, 19 తేదీల్లో శాసనసభ ప్రత్యేకంగా  సమావేశం కానుంది.

ఈ నెల 18,19న శాసనసభ ప్రత్యేక సమావేశాలు
author img

By

Published : Jul 12, 2019, 4:34 AM IST

Updated : Jul 12, 2019, 7:23 AM IST

ఈ నెల 18,19న శాసనసభ ప్రత్యేక సమావేశాలు

రాష్ట్రంలో మూడు కార్పొరేషన్లు, పురపాలక సంస్థల పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 2న పూర్తి కావడం వల్ల ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. పదవీకాలం పూర్తయిన వాటితో పాటు కొత్త మున్సిపాలిటీలకు ఆగస్టు 2లోపు పాలకవర్గాలు కొలువుదీరేలా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వార్డుల సంఖ్యకు సంబంధించి చట్టసవరణ చేస్తూ ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చింది. వార్డుల వారీ ఓటర్ల జాబితా ముసాయిదా ఇప్పటికే ప్రకటించగా... ఈ నెల 14న తుదిజాబితా ప్రకటించాల్సి ఉంది. జులై 19న పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటించాల్సి ఉంది. ముందు అనుకున్న ప్రకారం ఈ నెల 15న నోటిఫికేషన్ జారీ చేసి 30 లేదా 31న పోలింగ్ నిర్వహించాలని అధికారులు భావించారు.

పంచాయతీ రాజ్​ చట్టం తరహాలో పురపాలక చట్టం

రిజర్వేషన్ల ఖరారు అంశం కొన్ని సాంకేతిక ఇబ్బందులను తీసుకొచ్చింది. స్థానికసంస్థల్లో ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషాలో, బీసీలకు 33శాతం సీట్లను రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే రిజర్వేషన్ల శాతం 50 దాటుతుంది. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50శాతానికి మించరాదు. పంచాయతీల తరహాలోనే పట్టణ ప్రాంతాల్లోనూ రిజర్వేషన్లను 50శాతానికి కుదిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని మొదట భావించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందడం సహా జవాబుదారీతనం ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆ చట్టం అమల్లో ఉంది. ఇదే తరహాలో పట్టణ ప్రాంతాలకు కూడా పటిష్ఠమైన చట్టం రూపొందించాలన్న నిర్ణయానికి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం... గత కొన్ని నెలలుగా కసరత్తు చేస్తోంది.

పురపాలక చట్టం రూపకల్పనపై సీఎం ప్రత్యేక దృష్టి

వీలైనంత త్వరగా కొత్త చట్టాన్ని అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే అధికారులకు స్పష్టం చేశారు. రిజర్వేషన్ల అంశం ఉన్న నేపథ్యంలో పురపాలక ఎన్నికలకు ముందుగానే కొత్త చట్టం తీసుకురావాలని సీఎం నిర్ణయించారు. గత నాలుగైదు రోజులుగా నూతన పురపాలక చట్ట రూపకల్పనపై సీఎం నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారు. చట్టంలో పొందుపర్చాల్సిన అంశాలు, ప్రజాప్రతినిధుల పాత్ర తదితర అంశాలకు సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అందుకనుగుణంగా అధికారులు పురపాలక చట్ట ముసాయిదా రూపొందించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతో పాటు పట్టణ ప్రణాళికా విభాగానికి చెందిన చట్ట ముసాయిదాను సిద్ధం చేశారు. ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్లు, విధులు, బాధ్యతలు, ప్రజాప్రతినిధుల పాత్ర, ప్రజలకు మెరుగైన సేవలు, పట్టణాల రూపురేఖలు మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఇందులో పొందుపర్చారు.

చట్టం అమల్లోకి వచ్చాకే పుర పోరు

ముసాయిదా సిద్ధమైన నేపథ్యంలో కొత్త చట్టం అమల్లోకి వచ్చాకే పురపాలక ఎన్నికలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ముసాయిదాను న్యాయశాఖ పరిశీలనకు పంపడంతో పాటు ఈ నెల 18, 19 తేదీల్లో శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇతరత్రా ఎజెండా ఏమీ లేకుండా కేవలం పురపాలక చట్టం కోసమే ఉభయసభలను సమావేశపరుస్తున్నారు. బిల్లు ఉభయసభల ఆమోదం పొంది చట్టరూపం దాల్చిన వెంటనే అందుకు అనుగుణంగా రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ పూర్తై వివరాలు అందిన వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం పురపాలక ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనుంది. వచ్చే నెల మొదటి వారంలో పురపాలక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఇవీ చూడండి: పైసలిస్తే అందలం ఎక్కిస్తా... కాదంటే కాళ్లు పట్టిస్తా

Intro:Body:Conclusion:
Last Updated : Jul 12, 2019, 7:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.