నూతన పురపాలక చట్ట రూపకల్పన కోసం శాసనసభ రేపట్నుంచి ప్రత్యేకంగా సమావేశం కానుంది. రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. పురపాలక శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్... స్వయంగా కొత్త పురపాలక చట్ట బిల్లును సభలో ప్రవేశపెడతారు. ఆర్డినెన్స్‌ల స్థానంలో ఇతర బిల్లులు కూడా సభ ముందుకు రానున్నాయి. బిల్లుపై ఎల్లుండి శాసనసభలో చర్చ జరగనుంది. చర్చకు సీఎం కేసీఆర్ సమాధానం ఇవ్వనున్నారు. బిల్లును అసెంబ్లీ ఆమోదించాక 19వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు మండలి సమావేశమవుతుంది. పురపాలక చట్ట బిల్లుపై మండలిలోనూ చర్చించి ఆమోదిస్తారు. కేవలం పురపాలక బిల్లు కోసం ఉద్దేశించిన ప్రత్యేక సమావేశాలు కావడం వల్ల ప్రశ్నోత్తరాలు సహా ఇతరత్రా ఎలాంటి కార్యకలాపాలను చేపట్టబోరని సమాచారం.
ఇవీ చూడండి: 'దసరా నాటికి కార్యాలయాలకు కొబ్బరికాయ కొడదాం'