సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ మధ్య రైల్వే దేశంలోనే అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న జోన్‌గా రికార్డు సృష్టించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 18 వేల 43కోట్ల ఆదాయాన్ని నమోదు చేసి నెంబర్‌వన్‌గా నిలిచింది. అంతే కాకుండా... 10.4శాతం వృద్ధితో ముందంజలో ఉంది. రెండో అత్యధిక ఆదాయం పొందుతున్న జోన్‌గా వాల్తేర్ డివిజన్ ఉన్న ఈస్ట్‌కోస్ట్ జోన్ నిలిచినట్లు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయెల్ లోక్‌సభలో వెల్లడించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ ప్రతిపాదన లేదని మంత్రి స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: గోవా: భాజపాలో చేరిన 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు