నిమ్స్ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఓ మహిళకు ఆపరేషన్ చేసిన డాక్టర్లు..కడుపులో కత్తెర పెట్టి కుట్లు వేశారు. రోగుల ప్రాణాలంటే లెక్కేలేదు..మేమింతే అని మరోసారి నిరూపించారు. కడుపు నొప్పితో బాధ పడుతున్న 33 ఏళ్ల మహేశ్వరి అక్టోబర్ నిమ్స్ ఆస్పత్రికి వెళ్లింది. ఆమెకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు కత్తెరను కడుపులోనే మర్చిపోయారు. ఆపరేషన్ చేసినా కడుపు నొప్పి తగ్గలేదని ఈ రోజు ఉదయం డాక్టర్‌ను సంప్రదించారు. కడుపులో కత్తెర ఉన్నట్టు ఎక్స్‌రేలో తేలింది. కడుపునొప్పికి కారణమేంటో తెలిసి అంతా షాకయ్యారు. నిమ్స్ వైద్యుల నిర్లక్ష్యంపై ఆమె బంధువులు ఆందోళనకు దిగారు.
కడుపులో కత్తెర
అనారోగ్యంతో దవాఖానాకు వెళ్తే కడుపులో కత్తెర పెట్టి కుట్లేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ నిమ్స్ వైద్యుల ఘనకార్యమిది.