ETV Bharat / state

పల్లె పాలన మొదలైంది - sarpanch pramanam

గ్రామాల్లో స్వయం పాలన మొదలైంది. ఇటీవల గెలుపొందిన వారు ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. 12,680 గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపించింది. పలుచోట్ల మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

SARPANCH OATH
author img

By

Published : Feb 2, 2019, 8:09 PM IST

SARPANCH OATH
రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. సర్పంచులు, వార్డు సభ్యులుగా బాధ్యతలు స్వీకరించారు. పంచాయతీ కార్యదర్శులు.. పాలకవర్గాల తొలి సమావేశాన్ని నిర్వహించారు. మూడు విడతలుగా జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 12,680 పంచాయతీలకు పాలకులు ఎన్నికయ్యారు.
undefined

నిర్మల్​ జిల్లాలోని గ్రామపంచాయతీల్లో నూతన పాలకవర్గం కొలువుదీరింది. కొత్త సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్లపల్లి గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నికైన రవీందర్​రెడ్డి ప్రమాణ స్వీకారానికి మాజీ మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి హాజరయ్యారు. నూతన పాలకవర్గం గ్రామాభివృద్ధికి పాటుపడాలని కోరారు.

ఖమ్మం జిల్లాలో మండల అధికారులు నూతనంగా ఎంపికైన పంచాయతీ పాలకుల చేత ప్రమాణం చేయించారు. ఏన్కూరు, జూలూరుపాడు, కొనిజర్ల, కారేపల్లి మండలాల్లో జనసందోహం మధ్య ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఏనుకూరులో సర్పంచ్​గా ఎన్నికైన చిర్రా రుక్మిణి వెంకన్న దంపతులు మొక్కులు తీర్చుకునేందుకు భద్రాచలం వరకు పాదయాత్రగా వెళ్లారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో కొత్త పాలకవర్గాలు ఈరోజు బాధ్యతలు చేపట్టారు. మోత్కూరు మండలం దాచారం గ్రామ సర్పంచ్​ రజితను ఓడిపోయిన అభ్యర్థి శాలువాతో సన్మానించారు. గ్రామాభివృద్ధికి కృషి చేయాలని, తమ సాయం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన మొట్టమొదటి పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేసి.. స్వచ్ఛతపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి పాటుపడతామని వాగ్దానం చేశారు.

Intro:TG_WGL_27_02_WARD_SABHYULA_NIRASANA_AB_G1
....................
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం వాల్యా తండాలో సర్పంచి,వార్డు సభ్యుల పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తమను ఆహ్వానించలేదని ఆరోపిస్తూ వార్డు సభ్యులు గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలో సర్పంచ్ తో పాటు ఎనిమిది మంది వార్డు సభ్యులు ఉన్నారు. వీరిలో అధికారులు కేవలం నలుగురు తోనే పదవి ప్రమాణస్వీకారం చేయించి మిగతా నలుగురిని చేయించకుండా విస్మరించారని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. జిల్లా అధికారులు స్పందించి తమతో ప్రమాణస్వీకారం చేయించేలా బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
బైట్స్.....
1. భూక్యా చుక్కమ్మ ఒకటో వార్డు సభ్యురాలు
2. భూక్య బాలు ఆరో వార్డు సభ్యుడు

Body:ఆందోళన

Conclusion:8008574820
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.