రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని అంతర్జాతీయ ప్రబుద్ధ భారత్ ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజా వద్ద నిర్వహించారు. కులరహిత సమాజం కోసం పీపుల్స్ ప్లాజా నుంచి లిబర్టీ వరకు రన్ ఫర్ క్యాస్ట్ పేరిట నిర్వహించిన పరుగులో పెద్ద ఎత్తున యువకులు, మహిళలు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా ఉప్పల్ శాసనసభ్యులు భేతి సుభాష్ రెడ్డి హాజరయ్యారు. సామాజిక అసమానతలు రూపుమాపేందుకు అంబేడ్కర్ కృషి చేశారని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలపై అణిచివేత ధోరణి మారాలని ఆయన అన్నారు.
ఇవీ చూడండి: 'స్టార్టప్‌లు పెట్టేందుకు యువత ముందుకు రావాలి'