వ్యక్తిగత నమ్మకాలకు మాత్రమే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శించారు. సచివాలయం కూల్చివేత, కొత్త శాసనసభ నిర్మాణంపై జరిగిన అఖిల పక్ష భేటీకి ఆయన హాజరయ్యారు. వ్యక్తిగత లాభాల కోసమే అసెంబ్లీ, సచివాలయ భవనాలను కూల్చుతామంటున్నారని ధ్వజమెత్తారు. గ్రామీణ ప్రాంతాల్లో పురాతన భవనాల్లోనే పాఠశాలలు నడుస్తున్నాయన్నారు. పార్టీలకతీతంగా పోరాడితేనే కోర్టులు జోక్యం చేసుకుంటాయని రేవంత్ తెలిపారు. సెక్షన్ 8 కింద రాజధానిలోని భవనాల బాధ్యత గవర్నర్దేనన్న రేవంత్.. ఆయన స్పందించకుంటే రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: ఇది ప్రజాధన దుర్వినియోగమే : ఉత్తమ్