శాసససభ్యుల కోటా మండలి ఎన్నికలు శాసససభ్యుల కోటా మండలి ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మొదటి ఓటు హక్కును సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి వినియోగించుకున్నారు. రెండోఓటును తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వేశారు. ముఖ్యమంత్రికేసీఆర్ ఓటింగ్లో పాల్గొన్నారు. తెలంగాణ భవన్ నుంచి ఎమ్మెల్యేలను బస్సుల్లో తరలించింది గులాబీ పార్టీ. ఇప్పటికే 91 మంది తెరాస, ఏడుగురు మజ్లిస్ ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను బహిష్కరించింది. తెదేపా, భాజపా కూడా అదే బాటలో ఉన్నాయి.
5గంటలకు ఓట్ల లెక్కింపు
ఎమ్మెల్యే కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాల కోసం సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎన్నికలను ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్ పరిశీలిస్తున్నారు.
ఇవీ చూడండి:ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్