ETV Bharat / state

కత్తి కన్నీరుపెడుతోంది..! - knife

ప్రేమికుల రోజున కొబ్బరి బొండాలు కొట్టే ఓ కత్తి కన్నీరు పెడుతోంది. అమృతాన్ని అందించే కత్తి అమాయక యువతి నెత్తురు చూసానని గుండెలు పగిలేలా రోదిస్తోంది. ప్రేమ మాటున చేటు చేయొద్దు అంటూ వేడుకొంటోంది. ఇటీవల హైదరాబాద్​లో ప్రేమోన్మాది భరత్​ దాడిలో ఓ బాలిక నెత్తురు కళ్ల చూసిన ఆ కొబ్బరి కత్తి పడుతోన్న ఆవేదనకు అక్షర రూపమే ఈ కథనం..

కత్తి కన్నీరు
author img

By

Published : Feb 14, 2019, 3:12 PM IST

ప్రేమోన్మాదాన్ని కళ్లారా చూసిన ఓ కత్తి కథ
నేను కొబ్బరి బోండాలు కొట్టే కత్తిని. మనుషుల సంపూర్ణ ఆరోగ్యం కోసం పని చేయడమే కర్తవ్యంగా జీవితాన్ని సాగిస్తున్నా. ప్రేమ జంటలంటే నాకు అమితమైన అభిమానం. మండుటెండల్లో కోరిందే తడవుగా కొబ్బరి బొండా కొట్టేసి చల్లదనాన్ని అందిస్తాను. స్వచ్ఛమైన ఆ నీళ్లను తాగుతూ... వాళ్లు చేసుకునే బాసలు... చెప్పుకునే ఊసులు వింటూ మురిసిపోయేదాన్ని. కొబ్బరి బొండాలు న‌రికి బ‌తికినా, కొబ్బరి నీళ్లు తాగేవాళ్ల కడుపు చల్లగుండాలనే తత్వం నాది !
undefined

అలాంటి నేను భరత్ అనే ఓ ఆకతాయి చేసిన పనికి వెక్కివెక్కి ఏడుస్తున్నా... ఆ రోజు రాత్రి ఏడున్నర సమయంలో నన్ను ప‌ట్టుకొని పరుగెత్తాడో దుర్మార్గుడు. ఆ అమ్మాయి దగ్గరకెళ్లి "ప్రేమిస్తావా? లేదా చస్తావా?..." అని బెదిరించాడు. నీ మీద ప్రేమ‌లేద‌ని అమ్మాయి ఎంత ఏడ్చినా ఆకతాయి కనికరించలేదు. వాడి పిడికిట్లో బిగిసుకుపోతూనే 'నీ మీద ఆ అమ్మాయికి ప్రేమ లేదురా వదిలేయమని' నేను ఎంత బ్రతిమాలినా వినిపించుకోలేదు.

"త‌న బ‌తుకు తన ఇష్టం. అమ్మాయిని ఏం చేయకురా..." అని వాడి వేళ్లల్లో బోర్లపడి ఏడ్చినా ఆ రాక్షసుడు తెగబడ్డాడు. ఆ చిన్నారిని ఇష్టమొచ్చిన‌ విధంగా న‌రికాడు. రోజూ కొబ్బరినీళ్లతో ముఖం క‌డుక్కునే నేను.. ఆ రోజు నెత్తురుతో తడిసిపోయా. ఆ పాప ఏడుపు చూస్తుంటే, చావు బ‌త‌ుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే నా ఇన‌ుపగుండె బద్ధలైపోయేలా ఏడ్చింది.

ఇనుములో హృదయాన్ని మొలకెత్తించాలే కానీ... మారణాయుధంగా మార్చి ఆడపిల్లల ఉసురు తీయొద్దని మిమ్మల్ని వేడుకుంటున్నా. దయచేసి ప్రేమ రూపాన్ని చెరగనివ్వకండి అంటూ ప్రాధేయపడుతున్నా. ప్రేమించిన వాళ్లెవ్వరూ కత్తి పట్టరు. క‌త్తి ప‌ట్టారంటే అది ప్రేమే కాదని తెలుసుకోండి.

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

knifebharat
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.