హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహ్మత్ నగర్లో ఘోరం చోటుచేసుకుంది. డేవిడ్ అనే వ్యక్తి పృథ్వి అనే కిరాణా దుకాణం యజమానిని కత్తితో పొడిచి చంపాడు.
ఎందుకు చంపాడు?
దుకాణంలో సరుకులు ఉద్దెర ఇవ్వనందుకు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ విషయమై పృథ్వి జూబ్లీహిల్స్ ఔట్‌పోస్ట్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు పట్టించుకోలేదు. డేవిడ్ మద్యం మత్తులో ఉండి పృథ్విని కత్తితో పొడిచి చంపాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండిఃప్రమాదంలో నూతన దంపతుల మృతి