ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ విద్యార్థులు, తల్లిదండ్రులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. మొదటి సంవత్సరంలో టాపర్‌గా నిలిచిన విద్యార్థి రెండో సంవత్సరంలో ఒక సబ్జెక్ట్‌లో ఫెయిల్ కావడం అధికారుల నిర్లక్ష్యమేనని ఆరోపించారు. మూల్యాంకనంలో అవకతవకలతో 16 మంది విద్యార్థులు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని... విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న బోర్డు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా కమిషన్ ఆదేశాలివ్వాలని ఫిర్యాదులో కోరారు.
ఇవీ చూడండి: విద్యార్థులెవరూ ఆందోళన చెందొద్దు: మంత్రి జగదీష్ రెడ్డి