ETV Bharat / state

నేడు రైతుల పిటిషన్​పై తీర్పు వెల్లడించనున్న హైకోర్టు - formers

నిజామాబాద్​ రైతు అభ్యర్థుల పిటిషన్​పై నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఎన్నిక వాయిదా వేయాలంటూ గత ఏప్రిల్​ 4న అన్నదాతలు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

నేడు హైకోర్టు తీర్పు
author img

By

Published : Apr 8, 2019, 8:09 AM IST

నేడు రైతుల పిటిషన్​పై తీర్పు వెల్లడించనున్న హైకోర్టు

నిజామాబాద్​లో పోటీ చేసే రైతులు ఎన్నికను వాయిదా వేయాలని కోరుతూ ఏప్రిల్​ 4న హైకోర్టును ఆశ్రయించారు. అన్నదాతల పిటిషన్​ను విచారించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పు నేటికి వాయిదా వేసింది. ఎన్నికల సంఘం తమకు గుర్తులు ఎలా ఉంటాయో చెప్పలేదని.. వాటిపై ప్రచారం చేసుకోవడానికి సమయం లేదని కర్షకులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు ఎన్నికలు ఎలాగైనా నిర్వహించాలని ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు ఎలా ఉంటుందోనని అందరిలో ఆసక్తి నెలకొంది. ఇవీ చూడండి: స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ పచ్చజెండా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.