ETV Bharat / state

నీటిలో తగ్గిన ప్రాణవాయువు.. మరణశయ్యపై మీనాలు - dying

ఓ పక్క కాలుష్యకోరల్లో వాతావరణం నాశనం అవుతుంటే వాటి ప్రభావం జలావరణంపై పడుతోంది. నీటిలో ఆక్సిజన్ శాతం(బీవోడీ) తగ్గి చేపలు విలవిల్లాడుతున్న ఘటన హైదరాబాద్​లోని ఇందిరాపార్క్​లోని కొలనులో చోటుచేసుకుంది.

నీటిలో తగ్గిన ప్రాణవాయువు.. మరణశయ్యపై మీనాలు
author img

By

Published : May 14, 2019, 10:02 AM IST

Updated : May 14, 2019, 12:05 PM IST

నీటిలో తగ్గిన ప్రాణవాయువు.. మరణశయ్యపై మీనాలు

వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా నీటిలో ఆక్సిజన్ శాతం(బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్) తగ్గుతోంది. చేపలు బతికేందుకు కావలసిన కనిష్ఠ శాతం కూడా లేకుండా పోతోంది. తాజాగా హైదరాబాద్​లోని ఇందిరాపార్క్​లోని కొలనులో ఆక్సిజన్ శాతం పడిపోవడం వల్ల చేప పిల్లలు విలవిల్లాడుతున్నాయి. నీటి ఉపరితలం పైకి వచ్చి ఊపిరి పీల్చుకుంటున్న దృశ్యం కనిపించింది.

ప్రస్తుత పరిస్థితికి కారణం వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులేనన్నారు మత్స్యశాఖ డీడీ లక్ష్మీనారాయణ. ఎండ తగిలితే నీటిలో ఆక్సిజన్ శాతం పెరిగి చేపలు బతికే అవకాశం ఉందని తెలిపారు. చేపలు బతకాలంటే కొలనులో కొత్త నీటిని చేర్చడం లేదంటే ఎయిర్ హీటర్స్ పెట్టాలని సూచిస్తున్నారు.

ఇవీ చూడండి: గొంగళి పురుగులతో కీళ్ల నొప్పులకు మందు!

Last Updated : May 14, 2019, 12:05 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.