ETV Bharat / state

స్థానిక సంస్థల ఎన్నికపై హైకోర్టులో వ్యాజ్యం - undefined

మండల పరిషత్​, జిల్లా పరిషత్​ ఎన్నికలపై హైకోర్టులో వాజ్యం దాఖలైంది. రిజర్వేషన్ల ఖరారులో అన్యాయం జరిగిందంటూ బీసీ సంక్షేమ సంఘం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

స్థానిక సంస్థల ఎన్నికపై హైకోర్టులో వ్యాజ్యం
author img

By

Published : Apr 15, 2019, 9:22 PM IST

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. రిజర్వేషన్ల ఖరారులో అన్యాయం జరిగిందంటూ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​గౌడ్​ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్​లో కోరారు. బీసీ జనాభా లెక్కించిన తర్వాతే రిజర్వేషన్లు ఖరారు చేయాలని పేర్కొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికపై హైకోర్టులో వ్యాజ్యం

ఇవీ చూడండి: 18 తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. రిజర్వేషన్ల ఖరారులో అన్యాయం జరిగిందంటూ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​గౌడ్​ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్​లో కోరారు. బీసీ జనాభా లెక్కించిన తర్వాతే రిజర్వేషన్లు ఖరారు చేయాలని పేర్కొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికపై హైకోర్టులో వ్యాజ్యం

ఇవీ చూడండి: 18 తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్

Intro:Slug :. TG_NLG_21_15_HEAVY_PADDY_IN_SURYAPET_MARKET_AB_C1_HD

రిపోర్టింగ్ & కెమెరా : బి.మారయ్య , ఈటీవీ , సూర్యాపేట.

( ) సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కు ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న ధాన్యం రాసులతో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కిటకిటలాడుతోంది. భారీగా ధాన్యం మార్కెట్ కు చేరుతుండటంతో చేతులెత్తేసిన అధికారులు ధాన్యం క్రమబద్దీకరించేందుకు టోకెన్ విధానం అమలు చేయనున్నారు. మార్కెట్ అధికారులు దీని కోసం రేపు మార్కెట్ కు సెలవు ప్రకటించారు.

వాయిస్ ఓవర్ :

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్ల లో ఒకటిగా ఉంది. ఇక్కడి మార్కెట్ లో ఏడాది పొడవునా నిత్యం కొనుగోళ్లు జరుగుతాయి. ఈ రబీ సీజన్లో వరి ధాన్యం భారీగా వస్తుంది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైన సీజన్ లోఇవాళ అత్యధికంగా 67 వేల బస్తాల ధాన్యం మార్కెట్ కు వచ్చి చేరింది. అయితే మార్కెట్లోకి వచ్చిన ధాన్యం తుకాలు కావడానికి రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో మార్కెట్ అధికారులు వ్యవసాయ మార్కెట్ కు సెలవు ప్రకటించక తప్పలేదు. ఇవాళ రాత్రి మొత్తం కాంటాలు పూర్తి చేసి ఉదయం నుంచి ధాన్యం బస్తాలను తరలించనున్నారు. అధికంగా వస్తున్న ధాన్యానికి అడ్డుకట్ట వేసేందుకు మార్కెట్ అధికారులు ఎల్లుండి నుంచి టోకెన్ విధానం అమలు చేయనున్నారు. ప్రతిరోజు 20 వేల బస్తాల ధాన్యం కొనుగోలు చేసే విధంగా టోకెన్లను జారీ చేయాలని నిర్ణయించారు. పరిమిత స్థాయిలో వచ్చే ధాన్యాన్ని ఖరీదు చేయడం తోపాటు తరలించడం సులువు అవుతుందని అధికారులు అంచనవేశారు. ఈ కారణంతోనే మార్కెట్ అధికారులు టోకెన్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఏప్రిల్ 1న ప్రారంభమైన రబీ కొనుగోళ్లు ఇప్పటి వరకు ఒక లక్ష 870 బస్తాల ధాన్యాన్ని ఖరీదు చేశారు. మొత్తం 6720 మంది రైతులు మార్కెట్లో అమ్మకాలు జరిపారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో 120 మంది వ్యాపారులుండగా 80 మంది ప్రతిరోజు కొనుగోళ్ళు జరుపుతారు. ఇట్టి వ్యాపారులు ఇవాళ కొనుగోలు చేసిన ధాన్యానికి ఈ సాయంత్రమే సొమ్ము ముట్ట జెప్పుతారు. ఈ కారణంగా సుర్యాపేట మార్కెట్ కు కృష్ణ , ఖమ్మం , వరంగల్ జిల్లాల నుంచి రైతులు మార్కెట్ కు ధాన్యాన్ని తీసుకు వస్తారు. జిల్లాలో 74567 హెక్టార్ల వరిపంట రబీ లో సాగయింది. 567480 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి కానుందని అంచనా వేసిన అధికారులు జిల్లాలో ఇప్పటికే 132 ఐకేపీ కేంద్రాలను ప్రారంభించారు. ఐకెపి కేంద్రాల్లో ధాన్యం పోస్తే సకాలంలో డబ్బులు రావన్న కారణంతో రైతులు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ను ఆశ్రయిస్తున్నారు. రైతులు తమ పరిసరాల్లో ఉన్న ఐకెపి కేంద్రాల్లో దాన్యం విక్రయించాలని మార్కెట్ అధికారులు రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు...byte

1. వెంకన్న , మార్కెట్ కార్యదర్శి , సుర్యాపేట.


Body:...


Conclusion:..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.