సాంకేతిక సమస్యలతో నిలిచిపోయిన ప్రతిష్ఠాత్మక చంద్రయాన్ 2 ప్రయోగాన్ని.. ఈ సారి పకడ్బందీగా నిర్వహించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నాహాలు చేశారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల 43 నిముషాలకు ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ మార్క్ 3 ఎమ్1 వాహక నౌకను.. చందమామపైకి పంపనున్నారు. ఈ మేరకు.. ఇవాళ సాయంత్రం 6 గంటల 43 నిముషాలకు ప్రయోగ కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. 20 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగిన తర్వాత.. 3.8 టన్నుల బరువున్న చంద్రయాన్ 2 ఉపగ్రహాన్ని.. వాహకనౌక రోదసీలోకి తీసుకువెళ్లనుంది.
ఇవీ చూడండి: నగరానికి పండుగ శోభ.. లష్కర్ బోనాలు షురూ..