ETV Bharat / state

భట్టి దీక్షతో బయటపడ్డ విభేదాలు - tpcc

భట్టి విక్రమార్క దీక్ష విరమణతో కాంగ్రెస్​లో విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. ఓ వర్గం దీక్ష కొనసాగించాలంటే... మరో వర్గం విరమించాలని పట్టుబట్టటం వల్ల నేతల మధ్య సఖ్యత లేదని స్పష్టమైంది. పార్టీ విధానాల్ని ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లడంలోనూ నాయకత్వం విఫలమవుతుందన్న వాదన శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.

భట్టి దీక్షతో బయటపడ్డ విభేదాలు
author img

By

Published : Jun 13, 2019, 5:02 AM IST

Updated : Jun 13, 2019, 7:08 AM IST

కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్షంలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ... సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన దీక్ష పార్టీ నేతల మధ్య విభేదాలకు అవకాశం ఇచ్చింది. 36 గంటల పాటు ప్రజా పరిరక్షణ దీక్ష చేయాలని పోలీసుల అనుమతి తీసుకొని ఈ నెల 8న ఉదయం 11 గంటలకు ప్రారంభించారు. దీక్ష కొనసాగుతుండగా... దీనిని ప్రజాస్వామ్య పరిరక్షణ ఆమరణ దీక్షగా మార్పు చేస్తున్నట్లు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. 9వ తేదీ రాత్రి 11 గంటలకు అనుమతి ముగిసినందున భగ్నం చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసి విమర్శలు వస్తాయని వెనక్కి తగ్గారు. మరుసటి రోజు ఉదయం 7 గంటలప్పుడు శిబిరంపై దాడి చేసి భట్టిని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

ఆమరణ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మాజీ లోక్​సభ స్పీకర్ మీరా కుమార్ పరామర్శించేందుకు వస్తున్నట్లు పీసీసీకి సమాచారం అందింది. దీక్ష కొనసాగిస్తే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచినట్లవుతుందని ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు. కొనసాగించేందుకు నిర్ణయించుకున్న భట్టి వైద్యం చేయించుకోవడానికి నిరాకరించారు. ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు హెచ్చరించడం వల్ల మల్లు రవి జోక్యం చేసుకుని ఉత్తమ్ ప్రతిపాదనకు అభ్యంతరం చెప్పారు. వి. హనుమంతరావు కూడా రవికి మద్దతు తెలపటం వల్ల ఉత్తమ్ మిన్నకుండిపోయారు. నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు.

ఏదైనా కార్యక్రమం చేపట్టినప్పుడు నాయకులు విభేదాలు పక్కనపెట్టి కలిసికట్టుగా పనిచేయాలని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. అధికార పార్టీని ఎదుర్కునేందుకు ముఖ్యనేతలంతా ఏకతాటిపైకి వచ్చి సమష్ఠి నిర్ణయాలు తీసుకోవాలని శ్రేణులు కోరుతున్నారు. నేతల మధ్య సమన్వయ లోపం వల్లనే శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో ఘోర విఫలం చెందినట్లు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

భట్టి దీక్షతో బయటపడ్డ విభేదాలు

ఇవీ చూడండి: 'నిజాయతీ ఉంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయండి'

sample description
Last Updated : Jun 13, 2019, 7:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.