ETV Bharat / state

ఉన్నత విద్య ప్రవేశాలకు కేంద్రీకృత విధానం

రాష్ట్రంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇప్పటివరకు ఆయా విశ్వవిద్యాలయాలు ప్రవేశ పరీక్షలు నిర్వహించేవి. ప్రస్తుతం ప్రభుత్వం కేంద్రీకృత విధానం ప్రవేశ పెట్టి నాలుగు రకాల కోర్సుల్లో ప్రవేశాలకు కన్వీనర్​ను నియమించింది. కేంద్రీకృత విధానం వల్ల సమన్వయం పెరుగుతుందని మండలి భావిస్తోంది. నాలుగు రకాల పరీక్షలకు సంబంధించిన ప్రవేశాల కన్వీనర్‌గా ఓయూలోని మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగ సహ ఆచార్యుడు పి.రమేష్‌బాబు నియమితులయ్యారు.

ఉన్నత విద్య ప్రవేశాలకు కేంద్రీకృత విధానం
author img

By

Published : Jul 7, 2019, 9:07 AM IST

ఒక్కో కోర్సులో ప్రవేశాలకు ఒక్కో కన్వీనర్‌ను నియమించే విధానానికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి స్వస్తి పలికింది. ఉస్మానియా, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాలు నిర్వహిస్తున్న నాలుగు ప్రవేశ పరీక్షలకు సంబంధించి కేంద్రీకృత విధానాన్ని అమలుచేయనున్నారు. ఇక నాలుగు రకాల కోర్సులకు ప్రవేశాల కన్వీనర్‌గా ఒక్కరే ఉంటారు. ఆయన ఆధ్వర్యంలోనే ప్రవేశాలు జరుగుతాయి. కేంద్రీకృత విధానం వల్ల సమన్వయం పెరుగుతుందని మండలి భావిస్తోంది. ప్రస్తుతం సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ కన్వీనర్‌గా ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, ఈసెట్‌, ఐసెట్‌తో పాటు పాలిసెట్‌ ప్రవేశాలు జరుగుతున్నాయి. మిగిలిన ఎడ్‌సెట్‌, లాసెట్‌, పీజీఈసెట్‌, పీఈసెట్‌లకు మాత్రం ఒక్కోదానికి ఒక్కో కన్వీనర్‌ ఉంటున్నారు. సాధారణంగా ప్రవేశ పరీక్షల కన్వీనర్‌నే ప్రవేశాలకు సైతం నియమిస్తారు. దీని వల్ల ప్రభుత్వానికి మండలి ఏ సమాచారం పంపాలన్నా పలువురితో మాట్లాడాల్సి వస్తోంది. దీన్ని నిరోధించడానికే కేంద్రీకృత విధానాన్ని అమలుచేస్తున్నట్లు విద్యామండలి వర్గాలు తెలిపాయి. ప్రవేశ పరీక్షల (సెట్‌లు) కన్వీనర్లు, ప్రవేశాల కో-కన్వీనర్లుగా వ్యవహరిస్తారంటున్నారు.

కన్వీనర్‌గా రమేష్‌బాబు

నాలుగు రకాల పరీక్షలకు సంబంధించిన ప్రవేశాల కన్వీనర్‌గా ఓయూలోని మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగ సహ ఆచార్యుడు పి.రమేష్‌బాబు నియమితులయ్యారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి ఆదేశాలు జారీచేశారు. దీంతో బీఈడీ, ఎంటెక్‌/ఎంఫార్మసీ, బీఎల్‌/ఎల్‌ఎల్‌ఎం/ఎంఎల్‌, బీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు రమేష్‌బాబు ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఇప్పటికే రమేష్​ బాబు ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించే ఏడు రకాల ప్రవేశ పరీక్షలకు సాంకేతిక సమన్వయకర్తగానూ వ్యవహరిస్తున్నారు. ఓయూలో దూరవిద్య విభాగంలో ఉన్న క్యాంపు కార్యాలయాన్ని వినియోగించుకుంటారు.

ఇవీ చూడండి: పటిష్ఠమైన చట్టాలతోనే మెరుగైన సేవలు: కేసీఆర్

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.