హైదరాబాద్ పంజాగుట్టలో శనివారం దాడికి గురైన వ్యాపారి రామ్‌ప్రసాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతిచెందారు. విచారణకు పంజాగుట్ట ఏసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
అసలేం జరిగిందంటే..
పంజాగుట్టలోని వేంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో శనివారం దైవ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన రామ్‌ప్రసాద్‌పై ముగ్గురు వ్యక్తులు హత్యాయత్నం... చేసి అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలపాలైన బాధితున్ని స్థానికులు సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. క్షతగాత్రుడు గచ్చిబౌలిలో స్టీల్ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రామ్‌ప్రసాద్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. వ్యాపార లావాదేవీలే దాడికి దారి తీశాయా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
హత్య రూ. 50 కోట్ల కోసమేనా..!
వ్యాపారి రామ్‌ప్రసాద్‌ను కోగంటి సత్యం హత్య చేయించారని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నెల రోజుల నుంచి బెదిరింపులు వస్తున్నట్లు తెలిపారు. తనకు రావాల్సిన రూ.50 కోట్లను కోగంటి సత్యం ఇవ్వడం లేదని విజయవాడ కృష్ణలంక పోలీసులకు రామ్‌ప్రసాద్ ఇదివరకే ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
విచారణకు ప్రత్యేక బృందాలు
రామ్‌ప్రసాద్ హత్యపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణకు పంజాగుట్ట ఏసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పశ్చిమ మండల డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.
ఇవీ చూడండి: అనుమానాస్పద స్థితిలో దంపతులు మృతి