ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ ఉగ్రవాదిగా వ్యవహరిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. కాంగ్రెస్ శాసనసభ్యులు పార్టీ వీడటాన్ని క్విడ్ ప్రోకోగా అభివర్ణించారు. ఫిరాయింపులపై రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ నెల 26న పినపాకలో ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర ప్రారంభిస్తామన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ యాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: ఇంటర్ బోర్డు నిర్వాకంపై హెచ్చార్సీలో ఫిర్యాదు