ETV Bharat / state

తప్పిపోయిన కానిస్టేబుల్​ ఆచూకీ లభ్యం - ci

రెండు రోజుల క్రితం చనిపోతున్నట్లు స్నేహితునికి లేఖ రాసి అదృశ్యమైన బాచుపల్లి సీఐ కారు డ్రైవర్​, కానిస్టేబుల్​ లక్ష్మణ్ ఆచూకీ లభ్యం అయింది. ముంబయిలో కోనార్క్​ ఎక్స్​ప్రెస్​లో ఉన్నట్లు బాచుపల్లి సీఐ జగదీశ్వర్​ గుర్తించి హైదరాబాద్​ తీసుకొచ్చారు.

తప్పిపోయిన కానిస్టేబుల్​ ఆచూకీ లభ్యం
author img

By

Published : Jun 1, 2019, 8:01 AM IST

బాచుపల్లి సీఐ కార్ డ్రైవర్​గా పని చేస్తున్న కానిస్టేబుల్ లక్ష్మన్ ఆచూకీ లభ్యం అయింది. సీఐ జగదీశ్వర్​ చొరవతో ముంబయిలో ఉన్నట్లు గుర్తించి హైదరాబాద్​కు తీసుకువచ్చారు. మూడు రోజుల క్రితం చనిపోతున్నట్లు తన మిత్రునికి వాట్సప్ మెసేజ్ పెట్టి లక్ష్మణ్​ అదృశ్యం అయ్యాడు. నిన్న కోనార్క్​ ఎక్స్​ప్రెస్​ ట్రైన్​లో ఉన్నట్లు గుర్తించి హైదరాబాద్​ బాచుపల్లి పీఎస్​కు తీసుకొచ్చారు. లక్ష్మణ్​ను ఎందుకు వెళ్లాడని విచారించగా... తాను ముంబయికి ఎలా, ఎందుకు వెళ్లానో... ఏదీ తనకు గుర్తుకు లేదని వెల్లడించాడు. లక్ష్మన్ మానసిక కుంగుబాటులో ఉన్నాడని సాధారణ స్థితికి వచ్చేందుకు కొన్ని రోజుల సమయం పడుతుందని... ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కొన్ని రోజులు ఇంటికి పంపిస్తున్నట్లు సీఐ జగదీశ్వర్​ తెలిపారు.

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.