శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్ లైన్స్ ఆధికారులు ఇద్దరు ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేశారు. సమయానికంటే ముందుగానే విమానాశ్రయానికి చేరుకున్నా వారికి బోర్డింగ్ ఇవ్వకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టారు. తీరా ప్రయాణికులే సమయానికి రాలేదంటూ తిరిగి వెనక్కి పంపారు.
ధరణి భాను, బప్పానందు స్వాతి బెంగళూరు వెళ్ళేందుకు ఇండిగో 6ఈ 151 విమానానికి టికెట్లు బుక్ చేసుకున్నారు. సరైన సమయానికే విమానాశ్రయానికి చేరుకున్నారు. ధరణి భాను వృద్ధురాలు కావడం వల్ల వీల్ ఛైర్ కావాలని అధికారులను అడిగారు. సరైన సమయంలో అధికారులు స్పందించకపోవడం వల్ల విమానం బెంగళూరుకు బయలుదేరింది.
విమానం బయలుదేరే సమయం కంటే ముందే వచ్చినప్పటికీ అధికారులు అలసత్వం ప్రదర్శించడం వల్లే తాము విమానం మిస్సైనట్లు వారు ఆందోళన వ్యక్తం చేశారు. తన తల్లి నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ అధికారులు వీల్ చైర్ సదూపాయం కల్పించలేదంటూ ప్రయాణికురాలు స్వాతి ఆగ్రహించారు.
ఇవీ చూడండి: దిల్లీలో ఎన్డీఏ ముఖ్యనేతల సమావేశం