ఇవాళ ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని భీల్యాతండా సమీప చేనులో పిడుగు పడింది. ఈ ఘటనలో ఒక రైతు మరణించగా.. మరో 11 మంది అన్నదాతలు అస్వస్థతకు గురయ్యారు.
వారందరూ ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. వీరిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ఛైర్మన్ కనకయ్య పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని.. ఘటన జరిగిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చదవండి: నూతన రెవెన్యూ చట్టం ఆరంభం మాత్రమే: కేసీఆర్