భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో డ్రైనేజీలపై నిర్మించిన అక్రమ కట్టడాలను పురపాలక అధికారులు తొలగించారు. డ్రైనేజీలపై ఇతర నిర్మాణాలు చేపట్టడం వల్ల పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రమయిందని, కలెక్టర్ ఎంవీ రెడ్డి సూచనలతో ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని చేపడుతున్నామని పురపాలక అధికారులు తెలిపారు.
ఆక్రమణల తొలగింపుతో కొన్నిచోట్ల మిషన్ భగీరథ పైపు లైన్లు ధ్వంసం కావడం వల్ల అధికారులు వాటికి మరమ్మతు చేయిస్తున్నారు. పురపాలక సిబ్బంది ఇదే ధోరణి కొనసాగించాలని, మరోమారు డ్రైనేజీల ఆక్రమణలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని పట్టణ వాసులు కోరుతున్నారు.
- ఇదీ చూడండి... కరోనా పాజిటివ్ వచ్చినా.. కారు జోరు ఆగదు