భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ప్రముఖ వస్త్ర వ్యాపారి మల్లికార్జున్ రావు కరోనాతో మృతి చెందాడు. ఆయన మృతదేహానికి ఇల్లందు పురపాలక ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, ఇతర ప్రజాప్రతినిధులు పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు నిర్వహించారు.
కరోనా సృష్టిస్తున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పట్టణ వాసులు నిబంధనలు పాటించాలని మున్సిపల్ ఛైర్మన్ సూచించారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని చెెప్పారు. వైరస్ వ్యాప్తి నివారణలో ప్రతి ఒక్కరు బాధ్యతగా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.