ETV Bharat / state

ఆరుగురు పిల్లలు.. ఆకలిదప్పులు

కట్టుకున్న వాడు కాలం చేయడం వల్ల రోజూ కూలీ చేసుకుంటూ ఆరుగురు పిల్లల్ని పోషిస్తోంది. ఇప్పుడు లాక్​డౌన్​తో ఉపాధి లేక ఇబ్బందులు పడుతోంది. ప్రభుత్వం రేషన్​ బియ్యంతో పాటు నగదు కూడా ఇస్తోందని తెలియని ఈ అమాయక మహిళను ఆమె పిల్లల్ని ఎవరైనా దాతలు ఆదుకుంటే కొద్దోగొప్పో ఆ కుటుంబానికి సాయం చేసినట్లే.

author img

By

Published : Apr 26, 2020, 1:04 PM IST

Updated : Apr 26, 2020, 3:34 PM IST

women with six children fight for life at charla mandal
ఆరుగురు పిల్లలు.. ఆకలిదప్పులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఎర్రంపాడు గ్రామానికి చెందిన ఈమె పేరు దూది రామె (పై చిత్రంలో). ఈమెకు ఆరుగురు సంతానం. భర్త సోమరాజు గత నెల 21న ములుగు జిల్లా పస్రా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. కుటుంబ పెద్ద కాలం చేయడం, కరోనా నేపథ్యంలో ఉపాధి కరవవ్వడంతో ఆమె తన ఆరుగురు పిల్లల్ని పోషించడం కష్టమైపోతోంది. పెద్ద కుమార్తె జ్యోతి, భారతి, ప్రవీణ్‌, రాము, లక్ష్మీలతోపాటు ఆరు నెలల బాబు ఉన్నారు. రాము, లక్ష్మీ కవలలు.

ఇంటి యజమాని లేకపోవడంతో తన పిల్లల భవిష్యత్తుపై రామె ఆందోళన చెందుతోంది. చిన్న పిల్లల్ని ఇంటి వద్ద వదిలి కూలీ పనులకు వెళ్లలేని పరిస్థితి ఆమెది. ప్రభుత్వం ఇచ్చిన రేషన్‌ బియ్యంతో ప్రస్తుతం కడుపు నింపుకొంటున్నారు. ప్రభుత్వం సాయం రూ.1500(ఈనెల 16న బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి) తనకు వచ్చిందీ తెలియని అమాయకత్వం ఆమెది. రామె దయనీయ పరిస్థితిని చూసి ఎవరైనా దాతలు ఆదుకుంటే ఆ చిన్నారులకు కొద్దోగొప్పో భరోసా లభించినట్లే.

Last Updated : Apr 26, 2020, 3:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.