ETV Bharat / state

పోడు భూముల్లో పోరుబాట పడుతున్న గిరిజనులు - forest

వనం పట్టున ఉండే తాము పొట్టకూటికి నాలుగు చెట్లను నరికి పోడు చేస్తామే తప్ప ఏనాడూ పాడుచేసింది లేదని గిరి పుత్రులు అంటున్నారు. నిబంధనల చట్రంలో వారి వేదన అరణ్య రోదనగా మారింది. ఆకాశాన్ని నమ్మి, నేలమీద వేసే నాలుగు విత్తులకు రక్షణ లేక చాలాచోట్ల ఘర్షణకు దిగుతున్నారు. ఏలికలకు చేసుకున్న విన్నపాలు ఏమయ్యాయో తెలియక కొందరు.. ఏళ్లుగా ఉన్నా ఎందుకు హక్కులు కల్పించరని ఇంకొందరు పోడు భూముల్లో పోరుబాట పడుతున్నారు.

పోరు భూముల్లో పోరుబాట పడుతున్న గిరిజనులు
author img

By

Published : Jul 4, 2019, 8:01 AM IST

భూమిపై హక్కుల కోసం ఆదివాసీలు సుదీర్ఘంగా సాగించిన పోరాటాలను గుర్తించి 2005లో అటవీ హక్కుల చట్టాన్ని ప్రవేశపెట్టారు. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం డిసెంబరు 13, 2005కు ముందు పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులు హక్కుపత్రాలు పొందటానికి అర్హులు. చట్టం అమలు కోసం జిల్లాలో 2008 నుంచి 2010 మధ్య పలు దఫాలుగా అటవీ, రెవెన్యూ, ఐటీడీఏ శాఖలు సమావేశం అయ్యాయి. 2005 డిసెంబరు 13 వరకు పోడు సాగు చేసుకొన్న వారికి ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం ప్రకారం ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలను పంపిణీ చేశారు. అపరిష్కృత భూములకు సంబంధించి హక్కుపత్రాల సంగతేంటో అటవీ, రెవెన్యూ, ఐటీడీఏ అధికారులు నేటికీ తేల్చకపోవడంతో వివాదాలు నిత్యం రగులుతూనే ఉన్నాయి.

వలసలతో పెరిగిన పోడు

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 30 వేల మందికి పైగానే రకరకాల కారణాలతో ఛత్తీస్‌గఢ్‌ నుంచి వలసలు రాగా ఇందులో అత్యధికులు గొత్తికోయలే. కుక్కునూరు, వేలేరుపాడు (ప.గో), కూనవరం, వరరామచంద్రాపురం, చింతూరు, ఎటపాక (తూ.గో) జిల్లాలతోపాటు భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. పాల్వంచ, ములకలపల్లి, మణుగూరు, పినపాక, బూర్గంపాడు మండలాల్లోనూ వీరి నివాసాలు ఉన్నాయి. అన్ని వర్గాలకు చెందిన గిరిజనులు దశాబ్దాల ముందు నుంచే అడవులను, పొదలను తొలగించి జొన్న, రాగులు, మొక్కజొన్న, పెసలు, కందులు, వరి వంటివి సాగు చేస్తున్నారు. చట్టాన్ని అమలు చేయాలని ఎంతో కాలంగా ఉద్యమాలు చేస్తున్నా ఫలితం ఉండటం లేదు.

అపరిష్కృతంగా సంయుక్త సర్వేలు..

జిల్లాలో పోడు సాగు అటవీ హక్కుల చట్టం అమల్లోకి వచ్చాక పెరిగిందని అటవీశాఖ చెపుతుండగా గిరిజనులు మాత్రం తాము ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్నాము అని వాదిస్తున్నారు. కొత్తగా అడవి నరికి సేద్యం చేసిన వారినే (అంటే 2006 తరువాత) అడవుల్లోకి వెళ్లనీయం అంటుండగా చాలా ఏళ్లుగా సాగు చేస్తున్నా హక్కుపత్రాలు ఇవ్వడంలో వివక్ష చూపారని గిరిజనులు విమర్శిస్తున్నారు.

అధికారులపై దాడులు తగవు

గిరిజనులకు ఇంకా పట్టాలందించాల్సి ఉందన్నది ఎంత నిజమో అటవీ భూములకు రక్షణగా ఉంటున్న సిబ్బందిపై దాడులకు పాల్పడడం అంతే ఆక్షేపణీయం. తమ వద్ద ఆధారాలతో సంబంధిత అధికారులను, ప్రజాప్రతినిధులను సంప్రదించి న్యాయం పొందాలి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడులు చేయడం తగదని ముక్తకంఠంతో ప్రజాస్వామ్య వాదులు ఖండిస్తున్నారు.

తెర వెనుక నాయకులు.. ముందు గిరిజనులు

రాష్ట్రంలోనే అటవీ విస్తీర్ణం అధికంగా పూర్వ ఖమ్మం జిల్లాలో ఉంది. ఏటా ఖరీఫ్‌ సాగు సమయంలో పోడు వివాదం తెరమీదకు వస్తుంది. 2005 తర్వాత అడవులను నరికి పోడు చేశారంటూ పలుచోట్ల అధికారులు అడ్డుకొంటున్నారు. వివిధ మండలాల్లో అమాయక గిరిజనులను ముందుపెట్టి తెర వెనుక గిరిజనేతరులు అగ్గికి ఆజ్యం పోసినట్టు వివాదాన్ని రగిలిస్తున్నారు. చాలా మంది బడా గిరిజనేతరులు గిరిజనుల పోడు భూములను ఎంతో కొంతో ఇచ్చి వారి ఆధీనంలో ఉంచుకొంటున్నారు.

విస్తీర్ణం.. ఆక్రమణలు ఇలా

జిల్లాలో కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం, వైల్డ్‌లైఫ్‌ కిన్నెరసాని అటవీ డివిజన్లు ఉన్నాయి. వాటి పరిధిలో మొత్తం అటవీ విస్తీర్ణం 4,33,446 హెక్టార్లు ఉంది. అటవీ అధికారుల లెక్క ప్రకారం 2005 నుంచి 18 వరకు 90117 హెక్టార్లు ఆక్రమణకు గురైంది. పోడుభూముల పేరిట గిరిజనేతరుల ఆక్రమణలో 33848 హెక్టార్లు ఉన్నాయి.

ఇవీ చూడండి: రెండు రాష్ట్రాలు రెండేసి టీఎంసీల ప్రతిపాదన

sample description

For All Latest Updates

TAGGED:

foresttribes
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.