భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. అక్రమ వసూళ్లకు పాల్పడి ఆదివాసీలపై మావోయిస్టులు అరాచకంగా వ్యవహరిస్తున్నారని పోస్టర్లలో పేర్కొన్నారు.
"ఆదివాసీ అన్నలారా మన సమస్యలపై మనమే ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడదామని, మన భవిత మనమే నిర్మించుకుందాం" అని రాసి ఉన్న పోస్టర్లు ఇల్లందు నియోజకవర్గంలో దర్శనమిచ్చాయి. మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు ఎవరు వేశారనేది తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ నెల 28న మావోయిస్టులు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో వారికి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు చర్చనీయాంశమయ్యాయి.
- ఇదీ చూడండి తెలంగాణలో మరో 1,378 కరోనా కేసులు, 7 మరణాలు