గిరిజనుల భూములకు సాగునీరు అందించటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మాజీ మంత్రి జలగం ప్రసాదరావు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం కుడుములపాడులో గిరిజనులకు ఉచిత విద్యుత్ మోటార్లు, పంపుసెట్లను అందజేశారు. నిరుపేదలైన 26 మందికి రూ.26 లక్షల విలువైన వాటిని జలగం వెంగళరావు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
అంతకుముందు ట్రస్ట్ ద్వారా రెడ్డిగూడెంలోని 370 గిరిజన కుటుంబాలకు రంగులను అందించారు. అటవీ హక్కుల చట్టానికి ముందు నుంచే పోడు భూములు సాగు చేసుకున్న వారికి యాజమాన్య హక్కు కల్పిస్తామని ఎమ్మెల్యే నాగేశ్వరరావు అన్నారు. అటవీశాఖ అధికారులు గిరిజనులను ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు. గిరిజనులు ఇకపై అడవులను నరకవద్దని ఎమ్మెల్యే సూచించారు.