భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఎనిమిదో రోజు కొనసాగుతోంది. ఆర్టీసీ ఉద్యోగులకు సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, భాజపా, విద్యుత్ శాఖ, ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. అంబేడ్కర్ కూడలి వద్ద సీఎం వైఖరిని వ్యతిరేకిస్తూ కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పోలీసులు తొమ్మిది మంది కార్యకర్తలను అరెస్టు చేశారు. అనంతరం ఆర్టీసీ ఉద్యోగులు, వామపక్ష నాయకులు, కార్యకర్తలు మౌన దీక్ష ప్రదర్శన నిర్వహించారు. ముఖ్యమంత్రి వెంటనే ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే వీరయ్య డిమాండ్ చేశారు.
ఇదీ చదవండిః 'సమ్మెలో పాల్గొన్న వారిని తిరిగి తీసుకోవద్దు'